Wednesday, September 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ..

- Advertisement -

నవతెలంగాణ-డిచ్ పల్లి : ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామంలో లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆదేశాలాను సారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బుధవారం భూమి పూజ, ముగ్గు పోయడం జరిగిందని సర్పంచ్ కారణం గుండ సుజాత శ్రీనివాస్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంత రావు తెలిపారు. గ్రామ పరిధిలో గుడిసె లేకుండా ఉండటానికి ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ప్రత్యేక చోరవ చూపుతున్నారని సర్పంచ్ కారణం గుండ సుజాత శ్రీనివాస్ పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి సైతం నిధులు మంజూరు చేస్తారని అశా భావం వ్యక్తం చేశారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మంజూరైన వారు త్వరితగతిన పూర్తి చేసుకుని ప్రభుత్వం అందజేసే వాటిని 

లాబ్ది పోందలని సూచించారు. అదనంగా వచ్చిన వాటిలో గ్రామానికి 4 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంత రావు, ఉప సర్పంచ్ కుమ్మరి వెంకట్, పంచాయతీ కార్యదర్శి జంగం శ్వేత, వార్డు సభ్యులు ఎర్ర సాయిలు,జజుల గోపి, కటికే సతీష్, పల్లా రాజేందర్, మహేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బద్దం రెడ్డి, దగ్గి రాజన్న, గంగా నర్సయ్య తోపాటు లాబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -