Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్‘చేయూత'కు దరఖాస్తుల వెల్లువ

‘చేయూత’కు దరఖాస్తుల వెల్లువ

- Advertisement -

– మండలంలో 385 మంది దరఖాస్తులు 
– ఈనెల 15 వరకు గడువు పెంపు

నవతెలంగాణ-మల్హర్ రావు : చేయూత పథకం కింద అందించే సామాజిక పింఛన్ కోసం మండలంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. సుదీర్ఘ కాలం తర్వాత ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారిలో హర్షం వ్యక్తమైంది.గత నెల 8 నుంచి స్వీకరణ ప్రక్రియ ప్రారంభించగా 31వరకు మండల వ్యాప్తంగా 385 మంది వివిధ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్నారు.తొలుత ప్రభుత్వం ప్రకటిం చిన దరఖాస్తు గడువు ఆగస్టు 31తో ముగియగా తాజాగా మరో 15 రోజులు పొడిగించింది.దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.మండలంలో దివ్యాంగులు,వితంతువులు,ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు,డయాలసిస్, బోధకాల వ్యా ధిగ్రస్తులకు కొత్తగా పింఛన్లు అందించాలని నిర్ణ యించిన ప్రభుత్వం దాదాపు ఆరేళ్ల తర్వాత దరఖా స్తుకు అవకాశం కల్పించడంతో ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తూ వివరాలను అధికారులు ఎప్పటిక ప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.అర్హులై ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోని వారి కోసం తాజాగా మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఈమేరకు జిల్లా అధి కారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంకా ఎవరైనా అర్హులుంటే సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఎంపిడిఓ క్రాoతి కుమార్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -