నవతెలంగాణ – హైదరాబాద్ : ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ … తోటి ఆర్టిస్టు గత నెల 22న నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో ఈశ్వర్ సాయి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈశ్వర్‌సాయి ముందస్తు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్ డ్యాన్సర్లు మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయిల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరి వ్యక్తిగత జీవితం, వ్యవహారాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, తాజాగా ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫోక్ డాన్సర్ కోసం పోలీసుల గాలింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


