Sunday, September 6, 2026
E-PAPER
Homeజాతీయంచనిపోయాడనుకుని అంత్యక్రియలు.. జైలులో బతికే ఉన్నాడని తెలిసి షాక్!

చనిపోయాడనుకుని అంత్యక్రియలు.. జైలులో బతికే ఉన్నాడని తెలిసి షాక్!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పంజాబ్‌లోని కపుర్తలాలో వింత ఘటన చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన తమ కుమారుడు చనిపోయాడని భావించి ఓ కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. అయితే, కొద్దిరోజుల తర్వాత అతడు జైలులో బతికే ఉన్నాడని తెలియడంతో ఆ కుటుంబం ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురైంది. కపుర్తలాకు చెందిన రవి కుమార్ ఆగస్టు 5న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పూర్తిగా కాలిపోయిన ఓ యువకుడి మృతదేహం లభించగా, పోలీసులు చూపించిన ఫొటోల ఆధారంగా అది రవిదేనని కుటుంబం నిర్ధారించింది. ఆగస్టు 13న అంత్యక్రియలు నిర్వహించింది.

అయితే, సెప్టెంబర్ 2న కపుర్తలా సెంట్రల్ జైలు నుంచి కుటుంబానికి ఫోన్ వచ్చింది. రవి కుమార్ జైలులో ఉన్నాడని సిబ్బంది తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్నాడనే కేసులో జలంధర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు వెల్లడైంది. సెప్టెంబర్ 3న జైలుకు వెళ్లిన కుటుంబ సభ్యులు తమ కుమారుడిని బతికే ఉన్నాడని చూసి ఆనందించారు. అయితే, తాము అంత్యక్రియలు నిర్వహించింది ఎవరికి? అనే ప్రశ్న ఇప్పుడు మిగిలిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -