- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి గురువాయూర్-కున్నంకుళం రహదారిపై వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులను ఎడక్కళియూర్కు చెందిన మునీర్ (35), ఆయన భార్య సఫ్నా (25), వారి మూడేళ్ల కుమారుడు యామిల్ ఐబాక్గా పోలీసులు గుర్తించారు. పెళ్లి వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వస్తున్న కుటుంబం ఫోన్ మాట్లాడేందుకు రోడ్డుపక్కన బైక్ ఆపిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
- Advertisement -



