- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అహ్మదాబాద్‌లోని చాంద్‌ఖేడా ప్రాంతంలో ప్రముఖ గుజరాతీ సింగర్ కింజల్ రబారీ అపహరణకు గురైనట్లు ఆమె భర్త ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కింజల్ రబారీ తన భర్తతో కలిసి ఓ మాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ కింజల్ రబారీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



