Saturday, April 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమెటాలో మళ్లీ ఉద్యోగాల కోత...

మెటాలో మళ్లీ ఉద్యోగాల కోత…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చేపట్టనున్న తొలగింపుల ప్రక్రియలో భాగంగా తొలి విడత లేఆఫ్స్‌ను మే 20న నిర్వహించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొదటి రౌండ్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10% మంది, అంటే దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మూడు అంతర్గత వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. కంపెనీ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై వందల బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నారు. ఏఐ ఆధారంగా కంపెనీ పనితీరును సమూలంగా మార్చాలన్న ఆయన వ్యూహంలో భాగంగానే ఈ లేఆఫ్స్ చోటుచేసుకుంటున్నాయి. ఏఐ సాయంతో తక్కువ మంది ఉద్యోగులతో ముఖ్యంగా మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించి, అధిక సామర్థ్యం సాధించాలని కంపెనీ భావిస్తోంది. అయితే, ఈ లేఆఫ్‌ల సమయం లేదా వాటి పరిధిపై స్పందించడానికి మేటా నిరాకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -