Saturday, April 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలునగరంలో చల్లబడిన వాతావరణం..

నగరంలో చల్లబడిన వాతావరణం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌ మహానగంలో జనం భానుడి ప్రతాపంతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే వరుణుడు స్వల్ప ఊరటనిచ్చారు. ఇవాళ మధ్యాహ్నం నగరం అంతటా ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని తూర్పు, మధ్య భాగాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా అమీర్‌పేట్ , జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో చుట్టుపక్క ప్రాంతాలు, ఎల్బీ నగర్, హయాత్‌నగర్, వనస్థలిపురం, పెద్ద అంబర్‌పేట్ పరిసరాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ జల్లులు పడ్డాయి. నగరవ్యాప్తంగా మేఘాలు కమ్ముకోవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ అకస్మిక వర్షం వేసవి తాపం నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించింది. మరికొన్ని గంటల పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -