Tuesday, September 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు నాంపల్లి కోర్టులో ఊరట

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు నాంపల్లి కోర్టులో ఊరట

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌ రెడ్డి అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌ రెడ్డి రిమాండును నాంపల్లి కోర్టు తిరస్కరించింది. రూ.10 వేల పూచీకత్తులో 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. షూరిటీలు సమర్పించాక విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

 కాగా, శాసన సభాస్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్‌ అయ్యారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కూడా పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -