Wednesday, September 9, 2026
E-PAPER
Homeఆటలుజ్వెరెవ్‌ ‌సైతం..

జ్వెరెవ్‌ ‌సైతం..

- Advertisement -

క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ ‌సీడ్‌
యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌

న్యూయార్క్‌ (‌యుఎస్‌ఏ)
యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌‌లో టాప్‌ ‌సీడ్‌, జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌ ‌ముందంజ వేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ‌ప్రీ క్వార్టర్‌‌ఫైనల్లో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఇటలీ ఆటగాడు లూసియానోపై 6-2, 6-2, 7-6(7-3)తో జ్వెరెవ్‌ ‌గెలుపొందాడు. 13 ఏస్‌‌లు, నాలుగు బ్రేక్‌ ‌పాయింట్లతో మెరిసిన జ్వెరెవ్‌ ‌పాయింట్ల పరంగా 108-78తో పైచేయి సాధించి క్వార్టర్‌‌ఫైనల్లోకి ప్రవేశించాడు. గేముల పరంగా జ్వెరెవ్‌ 19 ‌నెగ్గగా.. ఇటలీ ఆటగాడు 10 గేములే నెగ్గాడు. మరో మ్యాచ్‌‌లో రష్యా ఆటగాడు కారెన్‌ ‌కచకోవ్‌ 7-5, 4-6, 6-7(6-8), 6-1, 6-4తో ఐదు సెట్ల మ్యాచ్‌‌లో లెర్నర్‌ ‌టీన్‌ (అమెరికా)పై విజయ సాధించాడు. ఆర్థర్‌ ‌గీ 6-3, 7-6(7-0)తో వరుస సెట్లలో గెలుపొంది శుభారంభం చేసినా.. బొటిక్‌ ఆ తర్వాతి మూడు సెట్లను 7-6(9-7), 7-6(7-3), 6-4తో సొంతం చేసుకుని క్వార్టర్‌‌ఫైనల్‌‌కు చేరుకున్నాడు. ​మహిళల సింగిల్స్‌‌లో నాల్గో సీడ్‌ ‌కొకొ గాఫ్‌ (అమెరికా) క్వార్టర్‌‌ఫైనల్‌‌కు చేరుకుంది. సహచర అమెరికా క్రీడాకారిణి, 14వ సీడ్‌ ఇవా జోవిక్‌‌పై 6-1, 6-4తో గాఫ్‌ అలవోక విజయం సాధించింది. ఆసియా స్టార్‌ ‌నవొమి ఒసాక (జపాన్‌)‌పై రెండో సీడ్‌ ‌కజకిస్తాన్‌ అమ్మాయి ఎలెనా రిబకినా పైచేయి సాధించింది. 6-1, 6-4తో వరుస సెట్లలో ఒసాకపై గెలుపొందిన రిబకినా మహిళల సింగిల్స్‌ ‌క్వార్టర్‌‌ఫైనల్‌‌కు చేరుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -