- Advertisement -
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
సెలవుల్లో హాస్టల్లో ఉండనివ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ విద్యార్థినులు బుధవారం ఉదయం హాస్టల్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పూర్తయిన నేపథ్యంలో సెలవుల్లోనూ హాస్టల్లో ఉండేందుకు తమను అనుమతించాలని, మెస్ సౌకర్యం కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆందోళనపై ఓయూ పోలీసులు స్పందించి వారిని ఓయూ సెనేట్ హాల్‌కు తీసుకెళ్లారు. అక్కడ రిజిస్ట్రార్, ఓఎస్డీతో విద్యార్థినులు సమావేశమయ్యారు. సెలవుల్లో హాస్టల్ వసతి, మెస్ సౌకర్యంపై ఆలోచించి నిర్ణయం వెల్లడిస్తామని విద్యార్థినులకు అధికారులు తెలిపారు. దాంతో వారు ఆందోళన విరమించారు.
- Advertisement -



