ఉద్యోగ జేఏసీ ప్రతినిధులతో చర్చలు : సీఎం రేవంత్ రెడ్డి హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఉద్యోగ జేఏసీ ప్రతినిధులతో సమావేశమై అన్ని సమస్యలు పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి సీఎంకు వినతిపత్రం ఇచ్చినట్టు కోదండరాం తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం శ్రీపాల్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం లు ప్రకటనలు విడుదల చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా ఉన్నారని శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు పోలీస్ పోస్టుల నియామకాలకు సంబంధించి వయో పరిమితి పెంచాలని కోరగా, వెంటనే జనరల్ అభ్యర్థులకు 32, యస్.సి., యస్.టి. అభ్యర్థులకు 37 సంవత్సరాల వయోపరిమితి పెంచుతూ సీఎం ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



