Thursday, September 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపాలకుల విధానాలతో వ్యవసాయరంగం కుదేలు

పాలకుల విధానాలతో వ్యవసాయరంగం కుదేలు

- Advertisement -


నవంబర్‌‌లో రైతు సంఘం జాతీయ మహాసభ : చిల్లాపురంలో ఇంటింటి ప్రచారంలో 
జూలకంటి రంగారెడ్డి
 నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్

​ కేంద్ర, రాష్ట్ర పాలకులు అవలంబిస్తున్న దివాలా కోరు విధానాలతో వ్యవసాయ రంగం రోజురోజుకూ కుదేలవుతోందని రైతు సంఘం జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. రైతుసంఘం జాతీయ మహాసభ జయప్రదం కోసం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలో బుధవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన చారిత్రక నేపథ్యం ఉన్న నల్లగొండ జిల్లాలో నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న రైతు సంఘం జాతీయ మహాసభ భవిష్యత్‌ రైతాంగ ఉద్యమాలకు చేయూతని‌వ్వడమే కాకుండా హక్కులను సాధించడానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపే దిక్సూచి అని తెలిపారు. దేశంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయలేని పాలకులు, రైతు ఉద్యమాల పట్ల చిన్నచూపు చూస్తున్నారన్నారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యవసాయం మొత్తం కార్పొరేట్లకు అప్పగించే కుట్రలో భాగంగా మరింత సంక్షోభంలోకి నేడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితుల్లో ఏఐకేఎస్ జాతీయ మహాసభ రైతు సమస్యల పరిష్కారానికి చర్చా వేదిక కానుందని చెప్పారు. రైతు జాతీయ మహాసభకు అన్ని వర్గాల ప్రజలు చేయూతనిచ్చి విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతాంగ హక్కుల కోసం పోరాడి ఎర్రజెండా నీడలో పేద ప్రజలకు సేవ చేసి అసువులు బాసిన చిల్లాపురం గ్రామానికి చెందిన కంచర్ల కోటిరెడ్డి ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, మిర్యాలగూడ మండల కార్యదర్శి రవి నాయక్, సీపీఐ(ఎం) వన్ టౌన్ కార్యదర్శి మల్లు గౌతమ్ రెడ్డి, నాయకులు కోట్ల శ్రీనివాసరెడ్డి, బద్దెపాక ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -