Monday, April 20, 2026
E-PAPER
Homeక్రైమ్సెల్‌ ఫోన్‌ చూడొద్దన్నందుకు ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

సెల్‌ ఫోన్‌ చూడొద్దన్నందుకు ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సెల్‌ ఫోన్‌ చూడొద్దని అక్కా, బావ మందలించారని యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఏపీలోని క‌డ‌జ జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. పట్టణ పోలీసుల సమాచారం మేరకు.. రాజంపేట పట్టణ శివారులోని భువనగిరిపల్లి ముఖద్వారానికి సమీపాన ఒడిశా రాష్ట్రం బదా జిల్లా నరసింహాపూర్‌ గ్రామానికి చెందిన అక్క మితాజెన్, బావ అజయ్‌కుమార్‌తో కలిసి యువతి సుమిత్ర (18) నివాసం ఉంటోంది. అక్కా బావ హోటల్‌లో పనిచేస్తున్నారు. యువతి ఎప్పుడూ సెల్‌ ఫోన్‌ చూస్తుండటంతో అక్కా బావ మందలించారు. సెల్‌ ఫోన్‌ కూడా పగులగొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకోగా.. వారు గుర్తించి స్థానిక ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -