Monday, April 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలూసియానాలో కాల్పుల కలకలం.. 8 మంది చిన్నారుల మృతి

లూసియానాలో కాల్పుల కలకలం.. 8 మంది చిన్నారుల మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. లూసియానా రాష్ట్రంలోని ష్రీవ్‌పోర్ట్‌‌లో జరిగిన ఈ దారుణంలో 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు.

స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. లూసియానా రాష్ట్రం ష్రీవ్‌పోర్ట్‌‌ ప్రాంతంలో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 1 నుంచి 14 ఏళ్లలోపు వయసున్న ఎనిమిది మంది చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో కొందరు నిందితుడి బంధువులు కూడా ఉన్నారని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.

దాడుల తర్వాత నిందితుడు ఓ కారును అపహరించి పారిపోయాడు. పోలీసులు వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా, కాల్పులకు తెగబడ్డాడు. దీంతో తాము ఎదురుకాల్పులు జరపగా నిందితుడు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -