Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపు బ్యాంకులు బంద్..

రేపు బ్యాంకులు బంద్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రేపు (శుక్రవారం) ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెకు దిగనున్నారు. యూఎఫ్‌బీయూ, ఎఐబీఒఎ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ సమ్మెతో బ్యాంకు శాఖల సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. వారానికి 5 రోజుల పనిదినాలు అమలు చేయడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేయడం తదితర డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయనున్నాయి. డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల సమ్మె చేపడతామని హెచ్చరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -