- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్, ఫైర్, జైళ్లు, SPF విభాగాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని మరో 3 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పెంచిన 7 ఏళ్లకు అదనంగా ఈ 3 ఏళ్లను కలపడంతో మొత్తం 10 ఏళ్ల వయోసడలింపు లభించింది. దీనితో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 37 ఏళ్లకు చేరింది. ఆన్లైన్ దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది యువతకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది.
- Advertisement -



