- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. సభ జరుగుతున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన సమస్యలపై వెంటనే చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. మండలి చైర్మన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.
- Advertisement -



