- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హర్మూజ్ జలసంధిలో భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత నౌకాదళం భారత పతాక నౌకలకు అడ్వైజరీ జారీ చేసింది. లారక్ ఐలాండ్‌కు దూరంగా ఉండాలని, తమ నుంచి ఆదేశాలు వచ్చాకే హర్మూజ్‌లో ప్రయాణించాలని నేవీ సూచించింది. ఏప్రిల్ 18న దేశ్ గరిమ ట్యాంకర్ ఈ మార్గాన్ని దాటిన తర్వాత, అదే రోజు జగ్ అర్ణవ్, సన్మార్ హెరాల్డ్ నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి.
- Advertisement -



