Monday, April 20, 2026
E-PAPER
Homeక్రైమ్దివ్యాంగుడి గుడిసె ధ్వంసం ..

దివ్యాంగుడి గుడిసె ధ్వంసం ..

- Advertisement -

– ఫిర్యాదు చేసినా స్పందన లేదనీ ఆవేదన
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లాలోని అరుగొండ మండలం రాజంపేట గ్రామానికి చెందిన బంటు శ్యామ్ అనే  దివ్యాంగుడు ఎదుర్కొంటున్న సమస్యలపై వికలాంగుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొల బాలరాజ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ… పూర్తి అంగవైకల్యంతో నేలపై పాకుతూ జీవనం సాగిస్తున్న ఆ బాధితుడికి ఉపాధి లేకపోవడంతో, కేవలం పెన్షన్‌పై కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందని తెలిపారు. జీవనోపాధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంఘాల ద్వారా సహాయం పొందాలని భావించి, తనకు ఉన్న చిన్న చేనులో సుమారు లక్ష రూపాయల ఖర్చుతో కట్టెలతో గుడిసె నిర్మించుకున్నట్లు చెప్పారు.

అయితే గ్రామంలోని కొంతమంది వ్యక్తులు కక్ష సాధింపుగా గొడవపడి ఆ గుడిసెను ధ్వంసం చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని, ఈ నెల రెండో తేదీన గుడిసె దగ్ధమవగా, మూడో తేదీన ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా, ఏడో తేదీన బాధితుడిపైనే కేసు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. దివ్యాంగుల పట్ల ఈ విధమైన అమానుష వైఖరి సరికాదని, వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేయాలని, దివ్యాంగులకు రక్షణ కల్పించాలని కొల బాలరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. త్వరలోనే కలెక్టర్కు ఫిర్యాదు చెందినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -