- Advertisement -
నవతెలంగాణ – బజార్ హత్నూర్
రైతులు పండించే ప్రతి పంటను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలను మండల కేంద్రలలో ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూజజ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



