Monday, April 20, 2026
E-PAPER
Homeఖమ్మంఇంటర్ స్టేట్ 4వ ర్యాంకర్ సాత్విక్ కు సన్మానం 

ఇంటర్ స్టేట్ 4వ ర్యాంకర్ సాత్విక్ కు సన్మానం 

- Advertisement -

– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అభినందనలు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే విజయాలు వెతుక్కుంటూ వస్తాయని తద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చునని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట కు చెందిన ప్రముఖ సాహితీవేత్త సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు కుమారుడు సిద్ధాంతపు సాత్విక్ సాయి కుమారాచార్యులు ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 కి గాను 466 మార్కులు సాధించి తెలంగాణ స్టేట్ 4 వ ర్యాంకు సాధించాడు. స్థానిక వి.కెడి.వి. కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అశ్వారావుపేట హైస్కూల్ లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి సాత్విక్ ను పిలిపించి ఘనంగా సన్మానించి అభినందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాత్విక్ పట్టుదలతో చదివి విజయాన్ని సాధించి తోటి విద్యార్ధులకు ఆదర్శంగా నిలిచాడని రెండవ సంత్సరంలో కూడా ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. సాత్విక్ సాధించిన విజయానికి చక్కని మార్గదర్శనం చేసిన కళాశాల అధ్యాపకులు అబినందనీయులని అన్నారు.  ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఛైర్పర్సన్ జూపల్లి శశికళ, మండల విద్యాధికారి ప్రసాదరావు, కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు హరిత, షాహీనా బేగం, కొండలరావు, వెంకటేశ్వరరావు, ఆత్మకమిటి ఛైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, ప్రమోద్ ,సిద్ధాంతపు శ్యాం కుమర్,తుమ్మ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -