- Advertisement -
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 35 శాతం వృద్ధితో రూ.2,014 కోట్ల నికర లాభాలు సాధించింది. పూణె కేంద్రంగా పని చేస్తోన్న ఈ బ్యాంక్ గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,493 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.7,711 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ4లో రూ.8,693 కోట్లకు పెరిగింది. 2025 మార్చి నాటికి 1.74 శాతంగా ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు.. 2026 మార్చి నాటికి 1.45 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 0.18 శాతం నుంచి 0.13 శాతానికి పరిమితమయ్యాయి.
- Advertisement -



