జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర
నవతెలంగాణ-అచ్చంపేట
అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో ముందుండి విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్‌లైన్ సిబ్బంది భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన ఉత్సహం యు.స్. టి అనే సాఫ్టువేర్ కంపెనీ సీస్సార్ లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో టైగర్ రిజర్వ్ పరిధిలో పనిచేస్తున్న 170 మంది బేస్‌క్యాంప్ వాచర్లు, యానిమల్ ట్రాకర్లు, పేపర్ పికర్స్‌కు రక్షణ సిబ్బందికి షూస్, బిల్‌హుక్స్, జాకెట్లు, ఇతర అవసరమైన రక్షణ సామగ్రితో కూడిన కిట్లను జిల్లా అటవీ అధికారి శ్రీ రేవంత్ చంద్ర పంపిణీ చేశారు.
అడవుల్లో పెట్రోలింగ్, వన్యప్రాణుల కదలికల పర్యవేక్షణ, అటవీ రక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, పరిశుభ్రత వంటి విధులను నిర్వహించే సిబ్బందికి ఈ సామగ్రి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో ఫ్రంట్‌లైన్ సిబ్బంది చేస్తున్న సేవలను అధికారులు అభినందించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్ర ప్రకాశ్ సింఘాల్, ఏ.సి.ఎఫ్ చంద్రశేఖర్, కంపినీ ప్రతినిధులు మదన్ రెడ్డి, విశాల్ దయాఫులే, శ్రీనాథ్ అల్లినేని, సందీప్ కొండపాక, అంకిత్ కుమార్ ఇతర అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.



