Sunday, September 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసైమా అవార్డ్స్‌-2026లో తేజ సజ్జా, రిషబ్‌శెట్టి సత్తా

సైమా అవార్డ్స్‌-2026లో తేజ సజ్జా, రిషబ్‌శెట్టి సత్తా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : బెంగళూరులోని కోరమంగళ ఇండోర్‌ స్టేడియంలో సైమా అవార్డ్స్‌-2026 వేడుక అట్టహాసంగా జరిగింది. తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందించారు. ‘మిరాయ్‌’ చిత్రంలో నటనకు తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఐశ్వర్య రాజేశ్‌ ఉత్తమ నటి (క్రిటిక్స్‌)గా నిలిచారు. అదే చిత్రంలోని బుల్లిరాజు అలియాస్‌ భీమల రేవంత్‌ ఉత్తమ హాస్యనటుడి అవార్డు అందుకున్నారు. కన్నడలో ‘కాంతార: చాప్టర్‌1’ నటనకు రిషబ్‌శెట్టి ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు.
అవార్డులు అందుకున్న సినీతారలు వీళ్లే 
ఉత్తమ నటి (పరిచయ) -సాక్షి మడోల్కర్ (మోగ్లీ)
ఉత్తమ నటుడు – తేజ సజ్జా (మిరాయ్‌)
ఉత్తమ నటి – ఐశ్వర్య రాజేశ్‌ (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ హాస్య నటుడు – బుల్లిరాజు (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ నేపథ్య గాయకుడు -రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ నేపథ్య గాయని -సమీరా భరద్వాజ్‌ (కోర్టు)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -