Sunday, September 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో భారత సంతతి మహిళ దారుణ హత్య

అమెరికాలో భారత సంతతి మహిళ దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళ దారుణ హత్యకు గురయ్యారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో నివాసముంటున్న 38 ఏళ్ల షాలినీ ఠాకూర్‌ను, గత ఏడాది కాలంగా వేధిస్తున్న ఓ యువకుడు నడిరోడ్డుపై కాల్చి చంపాడు. అనంతరం నిందితుడు కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోర ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆర్డెన్-ఆర్కేడ్ ప్రాంతంలోని పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల రోహిత్ అనే నిందితుడు షాలినీని వెంబడించి, అందరూ చూస్తుండగానే ఆమెపై పలుమార్లు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

హత్య అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హైవే-50 వద్ద అతడిని గుర్తించి చుట్టుముట్టారు. ఆ సమయంలో రోహిత్ తన వద్దనున్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిపై తాము ఎటువంటి కాల్పులు జరపలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. దాదాపు ఏడాది కాలంగా రోహిత్ తన కుమార్తెను నిరంతరం వేధిస్తున్నాడని షాలినీ తల్లి సుధేష్ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని రోహిత్ ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, అయితే వయసులో వ్యత్యాసం ఉండటంతో షాలినీ అందుకు నిరాకరించిందని తెలిపారు. అతడి వేధింపుల కారణంగా తన కుమార్తె గత కొంతకాలంగా తీవ్ర భయాందోళనల మధ్య గడిపిందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -