- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్ర నలసోపరా వెస్ట్‌లోని గౌరవ్ ప్రాంతంలో ఆదివారం గణేశుడి ఆగమన ఊరేగింపు సందర్భంగా.. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా వినాయక విగ్రహం అకస్మాత్తుగా కిందపడిపోయింది. అయితే ప్రమాద సమయంలో విగ్రహం కింద చిక్కుకున్న వారిని స్థానికులు, నిర్వాహకులు వెంటనే సురక్షితంగా బయటకు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు పూర్తి చేసి, విగ్రహాన్ని పునరుద్ధరించి యథాస్థానంలో నిలిపారు.
- Advertisement -



