Thursday, April 23, 2026
E-PAPER
Homeజాతీయంతమిళనాడులో 17.69 శాతం..బెంగాల్‌లో 18.76 శాతం

తమిళనాడులో 17.69 శాతం..బెంగాల్‌లో 18.76 శాతం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు తమిళనాడులో 17.69 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 18.76 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఈ రోజు తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడత కింద 152 స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రముఖులు, సినీ నటులు సామాన్యులతో కలిసి లైన్ లో నిలబడి ఓటు వేశారు.

మెగాస్టార్ రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాలలోని 237 నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో పాటు ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇతర కుటుంబ సభ్యులు ఓటు వేశారు. చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో వారంతా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.టీవీకే చీఫ్ విజయ్ నీలంకరై పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -