నవతెలంగాణ – హైదరాబాద్ : తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో ఓ వ్యక్తి తన తల్లి, భార్యను హత్య చేసి, అనంతరం పిల్లలతో కలిసి రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తండ్రి మోహన్ అనే వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మోహన్ తన భార్య హరిత (35), తల్లి చంద్రకళ (65)లను ఇంట్లోనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు చిన్నారులను తీసుకుని గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి, వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తండ్రి మోహన్‌తో పాటు ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామంలో ఒక్కసారిగా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు.
భార్య, తల్లిని హత్య చేసి.. ఇద్దరు పిల్లలతో భర్త ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



