- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: స్టార్ కమెడియన్‌గా టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన సత్య, ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జెట్లీ’. రితేశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ ట్రైలర్, చూసిన వారిని కడుపుబ్బా నవ్విస్తోంది. ట్రైలర్ ఆద్యంతం సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి.
- Advertisement -



