Monday, September 14, 2026
E-PAPER
Homeక్రైమ్హైదరాబాద్‌లో దారుణం..బాలికకు మత్తు మందు ఇచ్చి 8 మంది లైంగికదాడి

హైదరాబాద్‌లో దారుణం..బాలికకు మత్తు మందు ఇచ్చి 8 మంది లైంగికదాడి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బాలికపై లైంగికదాడికి పాల్పడిన 8 మందిపై అల్వాల్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మచ్చబొల్లారానికి చెందిన బాలిక(16) ఇంటర్‌ చదువుతోంది. పదో తరగతి చదివే సమయంలో జెర్రీ వరుణ్‌ అనే యువకుడు  పరిచయమయ్యాడు. కొన్ని నెలల క్రితం చాక్లెట్లో మత్తు మందు కలిపి తన కారులో  లైంగికదాడికి పాల్పడ్డాడు. జెర్రీ వరుణ్‌ ద్వారా పరిచయమైన రొమల వరుణ్‌ బాధితురాలికి మద్యం, సిగరెట్లు, గంజాయి అలవాటు చేసి కొంపల్లిలో లైంగికదాడి చేశాడు.

అంతకుముందే డేవిడ్‌ వరుణ్‌ అనే మరో వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమై మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడు. కుమార్తె ప్రవర్తనపై అనుమానం వచ్చిన తండ్రి ఈ నెల 9న మందలించడంతో బాలిక ఇల్లు వదిలి బొల్లారం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అక్కడ నీరజ్‌ అనే వ్యక్తి పరిచయమై మరో స్నేహితుడైన విక్కీని రప్పించుకున్నాడు. ఇద్దరు బాధితురాలిని మత్తులోకి దించారు. ఆ తర్వాత వేర్వేరుగా లైంగికదాడి చేశారు.

అనంతరం విక్కీ తన మిత్రుడు నిఖిల్‌తో కలిసి దూలపల్లి తీసుకెళ్లి అక్కడ మరో ఇద్దరితో కలిసి ఓయో గదిలో లైంగికదాడి చేశారు. బాధితురాలిని బొల్లారంలోని విక్కీ ఇంటికి తీసుకొచ్చి 9వ తేదీ రాత్రి బంధించారు. తప్పించుకొని 10న బొల్లారం రైల్వేస్టేషన్‌కు చేరుకోగా విక్కీ తన స్నేహితుడైన గణేశ్‌తో కలిసి అడ్డుకొని బాధితురాలిని బలవంతంగా మత్తులోకి దించి మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ రైలులో లైంగికదాడి చేసి మల్కాజిగిరికి చేరుకున్నారు.దూల్‌పేట వైపు ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బాలిక తప్పించుకొని ఇంటికి చేరుకుంది. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -