Monday, September 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమౌలాలి వద్ద ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై తెగిపడిన కరెంట్‌ తీగలు..

మౌలాలి వద్ద ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై తెగిపడిన కరెంట్‌ తీగలు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని మౌలాలి వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్‌ తీగలు తెగిపడ్డాయి. ఈ క్రమంలో భారీ శబ్దాలు రావటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే లోకో పైలెట్ రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు రైలు దిగి బయటకు పరుగులు తీశారు. విజయవాడ నుంచి SEC వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ తీగలు తెగి పడ్డాయని విద్యుత్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -