- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గణేశ్ మండపంలో విద్యుత్ షాక్‌తో అల్లు రాజు (26) అనే యువకుడు సోమవారం మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఒడిశాలోని జేకేపూర్‌లో చోటుచేసుకుంది. మండపాన్ని అలంకరిస్తుండగా అల్లు రాజుకు విద్యుత్ తీగ తగిలింది. అతడిని వెంటనే రాయగడ-1 జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు అల్లు రాజు ఏపీలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు.
- Advertisement -



