- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రిటైర్డ్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే 100 రోజుల్లోగా వారికి సంబంధించిన రూ.6,200 కోట్ల బకాయిలు చెల్లించాలని నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తక్షణమే ‘రెవెన్యూ రిసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే నెల 4న రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. ఆ రోజున.. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను ఎలా, ఎంత త్వరగా చెల్లించాలనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది.
- Advertisement -



