Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి 

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

తహశీల్దార్ వీరగంటి మహేందర్ 
నవతెలంగాణ – పెద్దవంగర
: రెవిన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ వీరగంటి మహేందర్ అన్నారు. మంగళవారం పోచారం గ్రామంలో రెవిన్యూ అధికారులు రెవిన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల నుండి రెవిన్యూ సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. రెవెన్యూ పరమైన సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేస్తే పరిష్కరిస్తామన్నారు. ముటేషన్, పలురకాల ధ్రువపత్రాల జారీకి ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భూ సరిహద్దు వివాదాలు, భూ ఆక్రమణలు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు జారీ వంటివి చేస్తామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ, సర్వే విభాగం అధికారులంతా అందుబాటులో ఉంటారని, భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కాగా నేడు బొమ్మకల్ లో రెవిన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img