నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే నెల అక్టోబర్ 6న నందిగ్రామ్ ఉప ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్‌లోని ప్రత్యర్థి వర్గాలకు ఎన్నికల సంఘం శుక్రవారం వేర్వేరు ఎన్నికల చిహ్నాలను కేటాయించింది. అరూప్ రాయ్ నేతృత్వంలోని వర్గానికి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరు, ‘ఎన్వలప్’ గుర్తును కేటాయించగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరు, ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయించారు. దీంతో మమతా బెనర్జీ , అరూప్ రాయ్ నేతృత్వంలోని వర్గాలు కొత్త గుర్తింపులతో బైపోల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్ర సీఎం సువేంధా అధికారి భబానీపూర్, నందిగ్రామ్ స్థానాల్లో పోటీ చేసి గెలిచారు. అయితే భబానీపూర్ ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో నందిగ్రామ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే నెల అక్టోబర్ 6న బైపోల్ జరగనుంది.9న ఫలితాలు వెల్లడికానున్నాయి.



