- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ మేరకు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ఎలక్టన్ కమిషన్, రాష్ట్ర శాసనసభ కార్యదర్శికి కోర్టు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సీటు ఖాళీ అయిన 6 నెలల్లోపు ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఖైరతాబాద్ శాసనసభ ఉప ఎన్నికను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
- Advertisement -



