Monday, September 21, 2026
E-PAPER
Homeజాతీయంభారత్‌లో పెరుగుతున్న వాతావరణ ముప్పు

భారత్‌లో పెరుగుతున్న వాతావరణ ముప్పు

- Advertisement -

మధ్య, వాయవ్య ప్రాంతాల్లో తీవ్ర ‘హాట్‌’స్పాట్లు
వేడి, కరువు, ఉక్కపోత, భారీ వర్షాల ప్రభావాలు..ప్రత్యేక వాతావరణ అనుసరణ చర్యలు అవసరం : శాస్త్రవేత్తలు

వాతావరణ మార్పుల ప్రభావంతో భారత్‌లో తీవ్ర పరిస్థితులు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. మధ్య, వాయవ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి ప్రభావిత భూభాగం ఏకంగా 40 శాతం వరకు పెరిగింది. దక్షిణ భారత్‌లో కరువు ముప్పు, తీర ప్రాంతాల నుంచి లోనికి విస్తరిస్తున్న ప్రమాదకర ఉక్కపోత, ఈశాన్య భారతంలో కుండపోత వర్షాలు దేశవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు సంకేతాలుగా నిలుస్తున్నాయి.

న్యూఢిల్లీ : భారత్‌లో వాతావరణ మార్పుల ప్రభావం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వేడిని ఎదుర్కొంటుండగా, మరికొన్ని కరువు, ప్రమాదకర ఉక్కపోత, భారీ వర్షాలతో సతమతమవుతున్నాయి. మధ్య, వాయవ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడి పరిస్థితులు ఎదుర్కొంటున్న భూభాగం 40 శాతం వరకు పెరిగినట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. 1971 నుంచి 2022 వరకు నమోదైన ఉష్ణోగ్రతలు, వర్షపాత వివరాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలు, వరుసగా వర్షాలు కురవని రోజులు, కరువు, తేమ, అధిక వేడి వంటి ఏడు సూచికలను కలిపి ‘క్లైమేట్ ఇండెక్స్‌’ను రూపొందిం చారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎలా మారుతున్నాయో గుర్తించేందుకు ఈ సూచికను ఉపయోగించారు. అధ్యయ నా నికి వాతావరణ శాస్త్రవేత్త, కేంద్ర భూ విజ్ఞానశాస్త్రాల శాఖ మాజీ కార్య దర్శి మాధవన్ రాజీవన్ నేతృత్వం వహించారు. నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్‌కు చెందిన శాస్త్రవేత్త తోట మోహన్ ప్రధాన రచయితగా ఉన్నారు. పరిశోధన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లైమటాలజీలో ప్రచురితమయ్యాయి.

తీర ప్రాంతాల నుంచి లోనికి ఉక్కపోత
అధిక ఉష్ణోగ్రత, తేమ కలిసినప్పుడు ఏర్పడే ప్రమాదకర ఉక్కపోత ముప్పు కూడా విస్తరిస్తోంది. అధిక తేమ కారణంగా శరీరం చెమట ద్వారా వేడిని సమర్థంగా బయటకు పంపుకోలేకపోవడం వల్ల ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుం ది. గత ఐదు దశాబ్దాల్లో ప్రమాదకర ఉక్కపోత ప్రభావిత ప్రాంతాలు తీర ప్రాంతాల నుంచి దేశంలోని అంతర్భా గాలకు విస్తరించాయని అధ్యయనం వెల్లడించింది. ఈ ప్రాంతం సుమారు పది శాతం పెరిగినట్టు పరిశోధకులు తెలిపారు.

దక్షిణ భారత్‌లో కరువు ముప్పు
దక్షిణ భారతంలో గరిష్ఠ ఉష్ణో గ్రతలు కూడా పెరుగుతున్నాయి. వర్షపాతం తగ్గడం, పట్టణాల్లో ఏర్పడే హీట్ ఐలాండ్ ప్రభావం, ఇతర వాతావరణ సంబంధిత అంశాలు వేడి తీవ్రతను పెంచుతున్నాయని శాస్త్ర వేత్తలు అభిప్రాయపడ్డారు. తూర్పు తీరప్రాంతాలు, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాలు వేగం గా పొడిబా రుతున్నట్టు అధ్యయనం గుర్తించింది. ఒడిశా, ఏపీ, తమిళ నాడులో కరువు ప్రభావిత ప్రాంతాలు నిరంతర సమస్యగా మారుతు న్నాయని పరిశోధకులు వివరించారు.

ఈశాన్యంలో భారీ వర్షాలు
ఈశాన్య భారత్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకే రోజులో కురిసే భారీ వర్షాల తీవ్రత పెరుగుతోంది. అదే సమయంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగు తుండటంతో చల్లని రాత్రుల సంఖ్య తగ్గుతోంది. ప్రాంతీ య ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు అడవుల నుంచి లభించే సహజ శీతలీ కరణ ప్రభావం తగ్గడం కూడా దీనికి కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రాంతాల వారీగా చర్యలు అవసరం
ప్రస్తుతం వాతావరణ మార్పులపై జరుగుతున్న అనేక అధ్యయనాలు ఒక్కో తీవ్ర వాతావరణ పరిస్థితిని విడివిడిగా పరిశీలిస్తున్నాయని పరిశో ధకులు తెలిపారు. అయితే ఏడు రకాల తీవ్ర వాతావరణ సూచికలను కలిపి రూపొందించిన ఈ కొత్త సూచిక ద్వారా వివిధ ప్రాంతాల్లో చోటుచే సుకుంటున్న మార్పులను సమగ్రంగా అర్థం చేసుకోవచ్చని తోట మోహన్ వివరించారు. వాతావరణ ముప్పులు ప్రాంతానికో విధంగా మారుతున్న నేపథ్యంలో అనుసరణ చర్యలు కూడా స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని మాధవన్ రాజీవన్ సూచించారు. వాయవ్య భారతంలో వేడి, పట్టణ ఉష్ణ ప్రభావాలపై దృష్టి పెట్టాల్సి ఉండగా, దక్షిణ భారత్‌లో కరువు నివారణ చర్యలు అవసరమని వివరించారు. ఈశాన్య భారత్‌లో భారీ వర్షాలు, వరదల ముప్పును ఎదుర్కొనే ప్రణాళికలు రూపొందిం చాల్సిన అవసరం ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు.

వాయవ్య భారతంలో అధిక వేడి
వాయవ్య భారతంలో తీవ్ర వేడి పెరుగుదల అత్యంత స్పష్టంగా కనిపించినట్టు పరిశోధకులు తెలిపారు. భూమి ఉపరితలంపై అధిక వేడి, నేలలో తేమ తగ్గడం, పొడి వాతావరణ పరిస్థితులు దీనికి దోహదం చేస్తున్నాయని వివరించారు. వేడి, కరువు ప్రభావిత ప్రాంతాలు గతంలో చిన్నచిన్న ప్రాంతాలుగా ఉండగా, ప్రస్తుతం అవి విస్తరించి పరస్పరం అనుసంధానమైన పెద్ద ప్రాంతాలుగా మారుతున్నాయని మాధవన్ రాజీవన్ వివరించారు. గ్లోబల్ వార్మింగ్‌తో పాటు స్థానిక పర్యావరణ పరిస్థితులు కూడా ఈ మార్పులకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

వెనక్కి మళ్లుతున్న నైరుతి !
43 శాతం భూభాగంలో వర్షాభావం..తెలంగాణలో 21 శాతం, ఏపీలో 43 శాతం వర్షపాతం లోటు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 22న తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -