– నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్
– ఇళ్ల స్థలాలు, అదనపు పరిహారం, ఉద్యోగాలు,
– ప్రత్యేక పథకాలు అమలు చేయాలి
నవతెలంగాణ–మక్తల్: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు ప్రభుత్వం మరిన్ని ప్రయోజనాలు కల్పించాలని ఎత్తిపోతల నిర్వాసితుల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి డా” వాకిటి శ్రీహరికి వినతిపత్రం సమర్పించి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించిందని కమిటీ పేర్కొంది. గతంతో పోలిస్తే పరిహారం మెరుగ్గా ఉన్నప్పటికీ, భూములు కోల్పోయిన కుటుంబాలకు దీర్ఘకాలికంగా అండగా నిలిచే విధంగా మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి ప్రాంతాల్లో నిర్వాసితులకు కల్పించిన తరహాలో మక్తల్, నారాయణపేట పట్టణాల్లో పూర్తిస్థాయి లేఅవుట్లతో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరారు. ప్రత్యామ్నాయంగా ఇళ్ల నిర్మాణానికి సమానమైన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా భూములు కోల్పోయిన రైతులకు అదనపు ఆర్థిక పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత కుటుంబాలకు ప్రత్యేక పెన్షన్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ప్రభుత్వ వివిధ సంక్షేమ పథకాల్లో వారికి ప్రాధాన్యత కల్పించేందుకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు.పాడి పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహం
నారాయణపేట జిల్లా కేంద్రంలో పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిర్వాసిత రైతులను పాడి పరిశ్రమ వైపు ప్రోత్సహించాలని కమిటీ కోరింది. ప్రత్యేక పథకం ద్వారా గేదెలు, ఆవులను సబ్సిడీపై అందించి, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల వరకు పాడి పశువుల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.
విద్య, ఉపాధికి ప్రాధాన్యత నిర్వాసిత కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ప్రాధాన్యతతో సీట్లు కేటాయించాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువకిరణాల తరహా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.భూములు కోల్పోయిన కుటుంబాల జీవనోపాధి, విద్య, ఉపాధి, పునరావాస అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ రూపొందించి అమలు చేయాలని మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల భూ నిర్వాసితుల కమిటీ గౌరవ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మరజ్ గోపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి గోవిందరాజు పుంజనూరు ఆంజనేయులు



