Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహుక్కా సెంటర్‌పై పోలీసుల ఆకస్మిక దాడి

హుక్కా సెంటర్‌పై పోలీసుల ఆకస్మిక దాడి

- Advertisement -

15 మంది అదుపులోకి..
నవతెలంగాణ-కాప్రా

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్ రోడ్డు ఎలైట్ కేఫ్‌లో సోమవారం హుక్కా సెంటర్‌పై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎస్.వి. రావు దిలీప్ మేనేజర్‌గా హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో గుర్తించామని, ఇందులో భాగంగానే తనిఖీలు చేసి 5 హుక్కా ఫ్లేవర్లు, 20 ఫిల్టర్లు, 6 హుక్కా పాట్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

హుక్కా సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి, నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -