Monday, September 21, 2026
E-PAPER
Homeఆటలుమిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో భారత్‌కు తొలి పతకం

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో భారత్‌కు తొలి పతకం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారిణి సుచికా తరిణాల్‌ చారిత్రాత్మక పతకం సాధించారు. మహిళల ట్రెడిషనల్‌ 60 కేజీల మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ విభాగంలో ఆమె కాంస్య పతకం దక్కించుకున్నారు. సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో సుచికా హోరాహోరీగా తలపడ్డారు. నిర్ణీత సమయం ముగిసే సరికి పోరు డ్రాగా ముగిసింది. దీంతో తక్కువ బరువు ఉన్న క్రీడాకారిణిని విజేతగా ప్రకటించే నిబంధన ప్రకారం టియోను విజేతగా ప్రకటించారు. ఇద్దరు క్రీడాకారిణుల బరువుల్లో కేవలం 700 గ్రాముల తేడా ఉండటంతో ప్రత్యర్థి విజేతగా ప్రకటించారు. దీంతో సుచికా ఫైనల్‌ అవకాశాన్ని కోల్పోయి కాంస్యంతో సరిపెట్టుకున్నారు. తీర్పు ప్రకటించిన వెంటనే సుచికా తీవ్ర భావోద్వేగానికి గురై మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ తొలిసారిగా ప్రవేశించిన ఈ ఏడాదే భారత్‌కు తొలి పతకం రావడం విశేషం. ఈ కాంస్యంతో ఆసియా క్రీడల్లో భారత్‌ మొత్తం పతకాల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటివరకు షూటర్లు నాలుగు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించారు.

హర్యానాకు చెందిన 36 ఏళ్ల సుచికా.. 12 ఏళ్ల వయసులో తనకు ఎదురైన ఈవ్‌టీజింగ్‌ ఘటనతో పోరాట కళలు నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ సంఘటన జరిగిన 24 ఏళ్ల తర్వాత ఆమెకు ఆసియా క్రీడల్లో చారిత్రాత్మక పతకం దక్కింది. అయితే ఈ విజయం ఆమెకు ఆనందాన్ని ఇవ్వకముందే తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -