Monday, September 21, 2026
E-PAPER
Homeజాతీయంకేరళలో భారీ వరదలు..ఏడుగురు మృతి

కేరళలో భారీ వరదలు..ఏడుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మలప్పురం జిల్లా నిలంబూర్‌లో కొట్టప్పుళ నదిలో ఆకస్మిక వరదలకు పలువురు కొట్టుకుపోయారు. రెస్క్యూ బృందాలు ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీశాయి. నదిలో చిక్కుకున్న 27 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరోవైపు ఇడుక్కి జిల్లా కొట్టకంబుర్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతోనే నదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరిగినట్లు అధికారులు తెలిపారు. నదులు, కొండ ప్రాంతాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -