నవతెలంగాణ – హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టు ముట్టడి పిలుపు జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీ ఎత్తున రంగంలోకి దిగి ముందస్తు అరెస్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిని వనపర్తిలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధం చేశారు. ముట్టడి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఇంటెలిజెన్స్ బలగాలను మోహరించి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హౌస్ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



