Homeజిల్లాలుఉప్పొంగిన గుండ్లసింగారం ప్రాజెక్టు

ఉప్పొంగిన గుండ్లసింగారం ప్రాజెక్టు

- Advertisement -

నవతెలంగాణ-నూతనకల్
మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు కుంటలు సగం వరకు నిండాయి. ఎల్ ని నోవో ప్రభావంతో వర్షాలు లేక పొలాలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో వర్షం రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వర్షం కురిస్తే చెరువులు పూర్తిగా నిండుతాయని ఆశాభావం చేస్తున్నారు. ఇప్పటికే వాగులు పొంగి గుండ్ల సింగారం బ్రిడ్జి పరవళ్ళు తొక్కుతోంది. దీంతో సందర్శకులకు ఆకర్షణీయంగా మారింది. వర్షం తగ్గగానే సందర్శకులు వెళ్లి ప్రాజెక్టు నీటి ప్రవాహాన్ని తిలకిస్తున్నారు. ప్రభుత్వ స్పందించి ఈ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్తానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -