Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా ఆకుల దేవేందర్ 

పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా ఆకుల దేవేందర్ 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక : పట్టణ కేంద్రంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా ఆకుల దేవేందర్ ను ఎన్నుకున్నట్లు పీఏసీఎస్ వైస్ చైర్మెన్, హనుమాన్ సేవ సమితి సభ్యులు కాల్వ నరేష్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ, ఘన చరిత్ర కలిగిన కాశీ విశ్వనాథుని ఆలయానికి పూర్వవైభవం తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. త్వరలోనే పట్టణంలోని ప్రతి కుల సంఘ పెద్దలతో సమావేశం నిర్వహించి ఆలయ కమిటీలను ఏర్పాటు చేస్తామని.. కుల,మత, రాజకీయాలకతీతంగా పట్టణ వ్యాపారస్తులు, ప్రజలు సహకరించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు దేవేందర్ ను హనుమాన్ సేవ సమితి సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. వారి వెంట మచ్చ శ్రీనివాస్, తునికి సురేష్, కడవేర్గు గోపి,బీపేట ప్రభాకర్, బెజ్జంకి వంశీ పలువురున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img