Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రైతు భరోసా ఆలస్యం .. సాగుకు శరాఘాతం

రైతు భరోసా ఆలస్యం .. సాగుకు శరాఘాతం

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ్య నాయక్ 
నవతెలంగాణ – ఉప్పునుంతల :
రైతు భరోసా, విత్తనాలు ఎరువులు సమస్యలపై జూన్ 11న తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా ను జయప్రదం చేయాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ్య నాయక్ పిలుపునిచ్చారు. రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేయాలని, విత్తన చట్టాన్ని ఆమోదించాలని, విత్తనాలు ఎరువులు సమస్యలపై జూన్ 11న జిల్లాలోని అన్ని తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు పెట్టుబడికి డబ్బులు అత్యవసరం ఉన్నందున తక్షణమే రైతు భరోసాను రైతుల ఖాతాలో నాలుగు ఎకరాల పైబడ్డ వారికి జమ చేయాలని తెలిపారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతునందున రైతులకు విత్తనాలు ఎరువులు అందుబాటులోకి తేవాలన్నారు. ధరల పట్టికలు పెట్టి, ధరణిలో సమస్యలు ఉన్న రైతులు, అసైన్డ్ భూములకు పట్టాలు రాని రైతులు, నకిలీ విత్తనాలు, మందులు అరికట్టాలి. జూన్ 11న జరిగే ధర్నాకు మండలంలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం)మండల కార్యదర్శి చింతల నాగరాజు, డివిజన్ సీనియర్ నాయకులు శివకుమార్, మండల కమిటీ సభ్యులు మాచర్ల కిష్టయ్య,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img