Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్కలప స్మగ్లింగ్కు పాల్పడితే చర్యలు..

కలప స్మగ్లింగ్కు పాల్పడితే చర్యలు..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : కలప స్మగ్లింగు పాల్పడితే సహించబోమని ఇందన్పల్లి రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ స్పస్టం చేశారు. ఆదివారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ గుట్టు చప్పుడు కాకుండా తమ సిబ్బంది కండ్లు కప్పి దొంగ చాటుగా చోటా మోటా స్మగ్లర్లు విలువైన కలపను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, అలాంటి వారిని పట్టుకొని కేసులు నమోదు చేసి జై లుకు పంపడం జరుగుతుందన్నారు. ఇటీవలే అనేక మంది కలప స్మగ్లర్లపై కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగిందని, మరి కొంత మంది పేర్లు తమ వద్ద ఉన్నాయని, వారిని పట్టుకొని కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కలప స్మగ్లింగు ఎవరైనా తమ సి బ్బంది సహకరించినట్లు విచారణలో తేలితే వారిపై సైతం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగు తుందని అన్నారు. ఇప్పటికైనా కలప స్మగ్లర్లు స్మగ్లింగ్కు దూరంగా ఉండి ఇతర పనుల్లో నిమగ్నంకా వాలని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రి పగలు తేడా లేకుండా తమ సిబ్బంది ఇంధన్పల్లి రేంజ్లో పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, అదే విధంగా చెక్పోస్టులలో సైతం సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా కలప స్మగ్లింగ్ చేస్తే తమకు నేరుగా కాని, ఫోన్లో గాని సమాచారం ఇవ్వాలని, అలాంటి వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img