Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మర్రి చెట్టు పూజలు..

ఘనంగా మర్రి చెట్టు పూజలు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పలు గ్రామాలలో వటపత్ర సాయి మర్రిచెట్టు ఊడల పూజలు మంగళవారం పున్నమి రోజు మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని నాగుల గావ్ , మడంపల్లి , పెద్దగుళ్ల, కంఠాలి, హంగర్గ , మాదాపూర్ గ్రామంలో మహిళలు మర్రి చెట్లు ఉన్నచోట బారులు తీరారు. వటపత్ర సాయి పూజల గురించి ప్రతి సంవత్సరం మృగశిర కార్తి మొదటి పున్నమి రోజు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పూజ చేయడానికి వచ్చిన మహిళలు మాట్లాడుతూ.. ఈ పూజలు ఘనంగా నిర్వహిస్తామని , భర్తలు జన్మల బంధం కొనసాగాలని, రాబోయే ఏడు జన్మలు వారితోనే ఉండాలని నమ్మకంతో మర్రిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తూ , తెల్లటి దారంతో 108 ముడి వేయడం జరుగుతుంది. భగవంతునికి నైవేద్యంగా మామిడిపండ్ల రసం, పప్పుతో తయారుచేసిన పోలేలు , పిండి పదార్థాలు తయారుచేసి నైవేద్యంగా సమర్పించడం  జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమాలను మహిళలు మాత్రమే పాల్గొనడం , వారే పూజలు చేయడం సాంప్రదాయంగా భావిస్తారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -