నవతెలంగాణ – హైదరాబాద్: గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు చీటింగ్ కేసులో అరెస్టు చేశారు. అయితే అఘోరికి సంగారెడ్డి జిల్లా జైలు అధికారులు షాక్ ఇచ్చారు. న్యాయమూర్తి ఆదేశాలతో అఘోరిని సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలుకు పోలీసులు తరలించగా, ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్‌లోనూ ఉంచలేమని జైలు అధికారులు తేల్చి చెప్పారు. లింగ నిర్ధారణ జరిగితే గానీ ఇక్కడ ఉంచుకోలేమని అఘోరిని జైలు అధికారులు తిరిగి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. అయితే ట్రాన్స్ జెండర్లకు చంచల్ గూడ జైలులో ప్రత్యేక బ్యారక్ వసతి ఉండటంతో అధికారులు అక్కడకు తరలించారు.a
అఘోరీకి లింగనిర్ధారణ ..?
- Advertisement -
RELATED ARTICLES