Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఎస్సైకి సన్మానం చేసిన గల్ఫ్ సంక్షేమ సమితి సభ్యులు..

ఎస్సైకి సన్మానం చేసిన గల్ఫ్ సంక్షేమ సమితి సభ్యులు..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి- ఆధ్వర్యంలో నూతనంగా వచ్చిన, ఎస్సై  గొల్లపల్లి అనూష ని రాష్ట్ర, మండల నాయకులతో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించడం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య తెలిపారు. ఈ సందర్భంగా కల్లెడ భూమయ్య మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో శాంతి భద్రతలు, మహిళా భద్రత, సామాజిక న్యాయం పరిరక్షణకు ఎస్సై  మరిన్ని సేవలు అందించాలని పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలుస్తూ, న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, ఆ దిశగా ఎస్సై అనూష చక్కటి బాధ్యతతో ముందంజలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సేపూర్ గోపాల్, అమరగొండ తిరుపతి, మహమ్మద్ హసన్, మండల అధ్యక్షులు మగ్గిడి తిరుపతి, జనరల్ సెక్రటరీ దుమ్మల ఎల్లయ్య (రెడ్డి ) మండల నాయకులు దుర్గం లచ్చన్న ఎండి ఖాదర్ భాయ్ కల్లెడ నరేష్ మేడిశెట్టి రవి మర్పల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad